
అంతర్జాతీయ క్రికెట్లో మరో మైలురాయిని అధిగమించిన ఎల్లీస్ పెర్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లలో ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులను సాధించి, ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజాగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో ఎల్లీస్ ఫెర్రీ మరో మైలురాయిని అధిగమించి సత్తా చాటింది.
ఈ మ్యాచుతో 91 పరుగులు చేసి త్రుటీలో సెంచరీ చేజార్చుకున్న ఆమె, అంతర్జాతీయ క్రికెట్లో 6వేల పరుగులు సాధించిన మహిళా ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా జట్టు 282/7 స్కోరు చేయగా.. ఇంగ్లండ్ 279/7 పరుగులు చేసి ఓటమి పాలైంది.
Details
ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియా తరుపున సాధించిన రికార్డులివే
ఎల్లీస్ పెర్రీ 133 వన్డే మ్యాచుల్లో 50.25 సగటుతో 3,518 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 142 టీ20ల్లో 31.28 సగటుతో 1,627 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్‌లో ఎనిమిది హాఫ్ సెంచరీలు బాదింది.
అదేవిధంగా పెర్రీ 11 టెస్టులు ఆడి 73.00 సగటుతో 876 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేసింది.
మొత్తంగా పెర్రీ ఆస్ట్రేలియా తరపున 286 మ్యాచ్‌లు ఆడి 44.93 సగటుతో 6,021 రన్స్ చేసింది. అదేవిధంగా బౌలింగ్ విభాగంలో అన్ని ఫార్మాట్లో కలిసి 323 వికెట్లను పడగొట్టింది.
మహిళల క్రికెట్‌లో 6,000 పరుగులు, 300 వికెట్లకు పైగా సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా పెర్రీ రికార్డుకెక్కింది.