నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీ వృథా.. రెండో వన్డేలో ఓటమి పాలైన ఇంగ్లండ్
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. నాట్ స్కివర్-బ్రంట్ సెంచరీతో ఆకట్టుకున్నా మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో ఇంగ్లండ్ మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. నాట్ స్కివర్-బ్రంట్ మెరుపు శతకంతో ఇంగ్లండ్ ను గెలిపించేందుకు ప్రయత్నం చేసింది. కానీ మిగిలిన బ్యాటర్ల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆమె సెంచరీ వృథాగా మారింది. దీంతో ఆమె వన్డేల్లో 6వ సెంచరీని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 282/7 స్కోరు చేయగా.. ఇంగ్లండ్ 279/7 పరుగులు చేసి పరాజయం పాలైంది.
అలనా కింగ్‌కి ఫ్లేయర్ ద ఆఫ్ మ్యాచ్
స్కివర్-బ్రంట్ ఇప్పటివరకూ వన్డేల్లో 44.38 సగటుతో 3,151 పరుగులు చేసింది. ఇందులో ఆరు సెంచరీలు, 20 అర్ధ సెంచచరీలను బాదింది. ఆస్ట్రేలియాపై వన్డేల్లో 57.93 సగటుతో 869 పరుగులు చేసింది. ఇందులో మూడు సెంచరీలు, మూడు హఫ్ సెంచరీలున్నాయి. ఇంగ్లీష్ గడ్డపై వన్డేల్లో ఆమె 40.79 సగటుతో 1,387 పరుగులు చేసింది. వన్డేల్లో ఇంగ్లండ్ తరుపున ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన నాల్గోవ ప్లేయర్ గా స్కివర్-బ్రంట్ నిలిచింది. ఆమె కంటే ముందు ఎడ్వర్డ్స్ (1,092), సారాటేలర్ (986), సమంతా టేలర్ (952) మాత్రమే ఉన్నారు. మూడు వికెట్లు తీసి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అలనా కింగ్‌కి ఫ్లేయర్ ద ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.