Page Loader
IND Vs ENG: వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి
వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి

IND Vs ENG: వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
10:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజకోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 145 పరుగులకు అల్ ఔట్ అయ్యింది. దీంతో మూడో టీ20లో భారత క్రికెట్ జట్టు 26 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హార్దిక్‌ పాండ్య (40) ఎంతో కష్టపడి ఆడినా, ఫలితం లేకుండా పోయింది. అభిషేక్‌ శర్మ (24), సూర్య (14), తిలక్‌ వర్మ (18), అక్షర్‌ పటేల్‌ (15)పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఓవర్టన్‌ 3 వికెట్లు తీశారు, ఆర్చర్‌, కార్సే చెరొ 2 వికెట్లు పడగొట్టారు. రషీద్‌, మార్క్‌వుడ్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడో టీ20లో 26 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లండ్