ODI World Cup 2023: ఆ విషయంలో టీమిండియాతో సమానంగా ఇంగ్లండ్
వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో ఇప్పుడు ఎక్కడా చూసినా మ్యాక్స్‌వెల్ నామస్మరణమే జరుగుతోంది. డబుల్ సెంచరీతో ఒంటిచేత్తో ఆసీస్ జట్టుకు విజయానని అందించాడు. అయితే మ్యాక్స్ వెల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసిన ముజీబ్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇక ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన తొలి మ్యాచులో 20 పరుగులకే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ ఇచ్చిన సులువైన క్యాచును మిచెల్ మార్ష్ వదిలేశాడు. దీంతో కోహ్లీ 85 పరుగులు చేసిన భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. ఎందుకంటే మ్యాచులో క్యాచులో విజయాన్ని అందిస్తాయని చెబుతుంటారు. అయితే ఈ ప్రపంచ కప్ అత్యధిక క్యాచులు పట్టిన జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
నేడు నెదర్లాండ్స్ తో తలపడనున్న ఇంగ్లండ్
ఈ టోర్నీలో ఏడు మ్యాచులాడిన ఇంగ్లండ్ ఒక్క మ్యాచులో గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో స్థానంలో ఉంది. క్యాచులు పట్టే విషయంలో ఇంగ్లండ్ ఏఫీషియన్సీ 85శాతంగా ఉండగా, ఈ అంశంలో టీమిండియాతో కలిసి ఇంగ్లండ్ జట్టు మొదటి స్థానంలో ఉంది. ఇవాళ మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో నెదర్లాండ్స్ తలపడనుంది. ఈ మ్యాచులో నెదర్లాండ్స్ విజయం సాధిస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఈ ఛాంపియన్ ట్రోఫీ అవకాశాలను ఇంగ్లండ్ కోల్పోయింది.