
Joe Root: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్.. మొదటి ఆటగాడిగా రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ తన అద్భుత ప్రదర్శనతో మరోసారి చరిత్ర సృష్టించాడు. భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో నాలుగో రోజు దశలో రూట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 6,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, 25 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రూట్ తన సెంచరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో వరుసగా అద్భుత షాట్లతో ఆకర్షణగా మారాడు.
Details
6వేల పరుగులు పూర్తి
ఒత్తిడి లేకుండా బౌలర్లను ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేసిన అతడు, తన 69వ టెస్ట్‌లోనే డబ్ల్యూటీసీలో 6,000 పరుగులు పూర్తి చేశాడు. ఇప్పటివరకు ఆయన ఖాతాలో 21 శతకాలు, 22 అర్ధశతకాలు నమోదు అయ్యాయి. డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్ తర్వాతి స్థానాల్లో స్టీవ్ స్మిత్ (4278), మార్నస్ లబుషేన్ (4225), బెన్ స్టోక్స్ (3616), ట్రావిస్ హెడ్ (3300) ఉన్నారు. ఇక టెస్టు క్రికెట్ చరిత్ర మొత్తం పరిశీలిస్తే.. రూట్ ఇప్పటికే 13,400 పరుగుల మార్కును దాటాడు. ఈ క్రమంలో రాహుల్ ద్రావిడ్, రికీ పాంటింగ్‌లను అధిగమించి రెండవ స్థానాన్ని సంపాదించాడు.
Details
సచిన్ రికార్డుకు చేరువలో
ఇప్పుడు అతడు టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ (15,921) చేసిన అత్యధిక పరుగుల రికార్డును ఛేదించే దిశగా సాగుతున్నాడు. సెంచరీల విషయానికి వస్తే.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కార (38 సెంచరీలు)ను రూట్ వెనక్కి నెట్టి, టెస్టుల్లో నాల్గవ అత్యధిక శతకాల నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జో రూట్ కెరీర్‌లో మరో గొప్ప మైలురాయి చేరుకోవడం తో, క్రికెట్ ప్రపంచం మళ్లీ అతడి బ్యాటింగ్ ప్రతిభను ప్రశంసిస్తోంది.