IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.
230పరుగుల లక్ష్యంతో నాలుగో రోజైన ఆదివారం బ్యాటింగ్‌ను ప్రారంభించిన టీమిండియా 202పరుగులకు ఆలౌట్ ఆయ్యింది.
అరంగేట్రం ఆటగాడు టామ్ హార్ట్లీ ఏడు వికెట్లు తీసి.. భారత్‌ను కోలుకోలేని దెబతీశాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ ఆలీ పోప్ చేసిన 196పరుగులు ఇంగ్లిష్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి.
పోప్ 278బంతుల్లో 196(21 ఫోర్లు)పరుగులు చేశాడు. భారత్‌లో ఒక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం విశేషం.
ఓవరాల్‌గా, భారత్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 150+స్కోరు నమోదు చేసిన 10వ ఆటగాడు.
టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన ఇంగ్లండ్
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ 70(88) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులతో భారత్ ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అర్ధశతకాలు బాదారు.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులు చేసింది. ఇందులో ఆలీ పోప్ 196 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
హార్ట్లీ అరంగేట్రం టెస్టులోనే తొమ్మిది వికెట్లు పడగొట్టి.. ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలమైనా.. బుమ్రా ఆరు వికెట్లతో సత్తా చాటాడు. టెస్టులో బుమ్రా 146 వికెట్లు సాధించాడు. 33 మ్యాచ్‌ల్లో ఇన్ని వికెట్లు తీసిన మూడో భారతీయ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.