Ind Vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే కటక్‌లోని భారామతి స్టేడియంలో జరుగుతోంది.
మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టాస్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అధికారికంగా ప్రకటించారు.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో టీమ్ ఇండియా బౌలింగ్ చేయనుంది. మొదటి వన్డేలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
Details
భారీ మార్పులతో బరిలోకి దిగతున్న భారత్ జట్టు
అయితే రెండో వన్డేలో టీమ్ ఇండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది.
కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనుండగా, అతనికి ఇదే అరంగేట్ర వన్డే కావడం విశేషం. అలాగే టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ మార్పులతో టీమ్ ఇండియా మరింత బలంగా కనిపిస్తోంది.