LOADING...
Asif Afridi: 38 ఏళ్ల వయస్సులో ఎంట్రీ.. 92 ఏళ్ల రికార్డు బద్దలు
38 ఏళ్ల వయస్సులో ఎంట్రీ.. 92 ఏళ్ల రికార్డు బద్దలు

Asif Afridi: 38 ఏళ్ల వయస్సులో ఎంట్రీ.. 92 ఏళ్ల రికార్డు బద్దలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది అరుదైన చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐదు వికెట్లు పడగొట్టి పెద్ద వయస్కుడిగా టెస్టు క్రికెట్‌లో రికార్డు స్థాపించాడు. 38 సంవత్సరాలు, 301 రోజుల వయసున్న ఆసిఫ్ అఫ్రిది బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చూపుతూ, 92 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డు ఇంతకుముందు ఇంగ్లండ్ బౌలర్ చార్లెస్ మారియట్‌కు చెందింది. ఆయన 1933 ఆగస్టు 12న ది ఓవల్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్‌లో 37 ఏళ్ల 332 రోజుల వయసులో ఐదు వికెట్లు తీసారు. ఆటలో ఆసిఫ్ అఫ్రిది హసన్ అలీ స్థానంలో జట్టులోకి వచ్చాడు.

Details

ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రతిభ

ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డిజోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, కాగిసో రబాడ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 333పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ 87, షఫీక్57, సౌద్ షకీల్ 66రన్స్ స్కోరు చేసి హాఫ్ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా కేశవ్ మహారాజ్ 7 వికెట్లు తీశాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అఫ్రిది 6 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆసిఫ్ అఫ్రిది అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు కోసం కీలక పాత్ర పోషించాడు, 38 ఏళ్ల 301 రోజుల వయసులో టెస్టులో ఐదు వికెట్లు తీసిన అత్యవసర రికార్డు తనదయ్యేలా చేసింది.