Page Loader
బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రా
బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది

బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మ్యాచ్ డ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2023
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

క్యాంప్ నౌలో జరిగిన UEFA యూరోపా లీగ్ 2022-23 నాకౌట్ రౌండ్ ఫ్లేఆప్‌ల మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మొదటి ఫస్ట్‌-లెగ్ టైంలో బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ తలపడ్డాయి. అయితే మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. రఫిన్హా అద్భుతమైన స్ట్రైక్‌తో సమం చేయడంతో జూల్స్ కౌండే సెల్ఫ్ గోల్ చేసి యునైటెడ్‌కు ఆధిక్యాన్ని అందించాడు. రాష్‌ఫోర్డ్ యునైటెడ్ కోసం ఈ సీజన్‌లో 22 గోల్స్ చేసి సత్తా చాటాడు. యూరోపా లీగ్ 2022-23 సీజన్‌లో యునైటెడ్ తరపున రాష్‌ఫోర్డ్ తన 4వ గోల్‌ను నమోదు చేయడం గమనార్హం. మొత్తంమీద రాష్‌ఫోర్డ్ 337 మ్యాచ్‌ల్లో 115 గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

యునైటెడ్

యునైటెడ్ 19 మ్యాచ్‌ల్లో 36 గోల్స్ చేసింది

మాజీ చెల్సియా డిఫెండర్ అలోన్సో ఈ సీజన్‌లో బార్కా కోసం తన 3వ గోల్‌ను సాధించాడు. ఈ సీజన్‌లో అన్ని పోటీల్లో బార్కా తరఫున రాఫిన్హా 7వ గోల్‌ను చేసి, తొమ్మిది అసిస్ట్‌లను సాధించాడు. రఫిన్హా 61 టచ్‌లు, 8 డ్యుయల్స్ గెలిచాడు. యునైటెడ్ యూరోప్‌లో 19 మ్యాచ్‌లలో 36 గోల్స్ గోల్స్ చేసింది. ఐరోపాలో ఈ సీజన్‌లో బార్కా ఐదు హోమ్ గేమ్‌లలో తొమ్మిది గోల్స్ చేసింది.