Loading...
KL Rahul: సచిన్, ధోనీ, కోహ్లీకూ సాధ్యం కాలేదు.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కేఎల్ రాహుల్!
సచిన్, ధోనీ, కోహ్లీకూ సాధ్యం కాలేదు.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కేఎల్ రాహుల్!

KL Rahul: సచిన్, ధోనీ, కోహ్లీకూ సాధ్యం కాలేదు.. చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో కేఎల్ రాహుల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 31, 2026
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడనుంది. తొలి టెస్టు చారిత్రాత్మక గాళ్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్ భారత స్టార్ వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ కెరీర్‌లో ప్రత్యేక మైలురాయిగా నిలిచే అవకాశముంది. ఎందుకంటే, భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ సాధించని అరుదైన ఘనతను ఆయన తన పేరిట లిఖించుకునే అంచున ఉన్నాడు.

వివరాలు

10 వేల పరుగులకు కేవలం 170 పరుగుల దూరంలో

అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేఎల్ రాహుల్‌కు ఇంకా 170 పరుగులు మాత్రమే అవసరం.

ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కలిపి ఆయన 9,830 పరుగులు చేశారు.

శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, 10 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటారు.

వివరాలు

భారత క్రికెట్‌లో ఎవరికీ లేని ప్రత్యేక రికార్డు

ఈ ఘనతలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క బంతి కూడా బౌలింగ్ చేయకుండా 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించనున్నారు.

ఇప్పటివరకు భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తదితరులు తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో కనీసం కొన్ని ఓవర్లయినా బౌలింగ్ చేశారు.

అయితే కేఎల్ రాహుల్ మాత్రం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క బంతి కూడా వేయలేదు.

అంతేకాదు బౌలింగ్ చేయకుండా భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా ఆయన ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు

బౌలింగ్ చేయకుండా అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్లు

కేఎల్ రాహుల్ - 9,830 పరుగులు

అజింక్య రహానే - 8,414 పరుగులు

రిషభ్ పంత్ - 5,637 పరుగులు

ఇషాన్ కిషన్ - 2,793 పరుగులు

ఫారూఖ్ ఇంజనీర్ - 2,725 పరుగులు

మూడు ఫార్మాట్లలో రాహుల్ అద్భుత ప్రస్థానం

కేఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు కీలక బ్యాటర్‌గా నిలిచారు.

టెస్టులు

మ్యాచ్‌లు: 68

ఇన్నింగ్స్‌లు: 119

పరుగులు: 4,153

సగటు: 36.42

సెంచరీలు: 12

హాఫ్ సెంచరీలు: 20

వన్డేలు

మ్యాచ్‌లు: 98

ఇన్నింగ్స్‌లు: 90

పరుగులు: 3,412

సగటు: 49.44

సెంచరీలు: 8

హాఫ్ సెంచరీలు: 20

టీ20లు

మ్యాచ్‌లు: 72

పరుగులు: 2,265

సెంచరీలు: 2

హాఫ్ సెంచరీలు: 22

ADVERTISEMENT