
Dhoni: రొటేషన్ విధానంతోనే ప్రతి క్రికెటర్ కు అవకాశం : ధోనీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ రెండు దశాబ్దాలుగా రొటేషన్ విధానాన్ని గణనీయంగా పాటిస్తోంది. అయితే ముందు సిరీస్‌ల్లో 11 మందితో మ్యాచ్‌లు ఆడించేవారు.
కానీ బీసీసీఐ ఈ పద్ధతిని మార్చి, ప్రతి ఆటగాడికీ అవకాశాలు కల్పించే విధంగా రొటేషన్ విధానాన్ని అమలు చేసింది. దీనికి ఐపీఎల్ కూడా ఒక వేదికగా మారింది.
అక్కడ ప్రతీ ఆటగాడు తన సత్తా నిరూపించుకునే అవకాశం పొందుతున్నాడు.
ఫలితంగా జాతీయ జట్టులోకి చేరడం మార్గం సులభమైంది. ఇప్పుడు భారత్ వరుసగా సిరీస్‌లు ఆడుతుండటంతో, మరోసారి రొటేషన్ పాలసీపై చర్చ మొదలైంది.
నిజానికి 2006లోనే ఎంఎస్ ధోని ఈ విధానం భారత క్రికెట్‌కి అవసరమని పేర్కొన్నారు.
రొటేషన్ విధానం క్రికెట్‌లో చాలా కీలకమైందని, దీని ద్వారా ఆటగాళ్లకు విశ్రాంతి లభిస్తుందన్నారు.
Details
11 మందితో కొనసాగితే కొత్తవారికి ఛాన్స్ దొరకదు
ఇక ప్రతి క్రికెటర్‌కు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని, ఎప్పటికప్పుడు ఒకే జట్టులో 11 మంది క్రీడాకారులతో కొనసాగితే కొత్తవారికి చాన్స్ రావడం కష్టమవుతుందని ధోనీ చెప్పాడు.
ఇక ధోనీ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆడతారా లేదా అనే ప్రశ్న అభిమానులను, విశ్లేషకులను ఆసక్తిగా ఉంచుతోంది.
బీసీసీఐ ఇప్పటికే రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ విధానాలను ఖరారు చేసింది. ఈ నెలాఖరులోగా జట్లకు తమ ఆటగాళ్ల జాబితాలను సమర్పించాల్సిన అవసరం ఉంది.
సీఎస్కే కెప్టెన్‌గా ఇప్పటి వరకు సూపర్ విజయాలను అందించిన ధోనీకి రూ. 4 కోట్లకు రిటైన్ చేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ పేర్కొన్నారు.