తదుపరి వార్తా కథనం
IND vs PAK: విజృంభించిన బౌలర్లు.. టీమిండియా ముందు స్వల్ప లక్ష్యం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 23, 2025
06:25 pm
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్ వేదికగా ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
నిర్ణీత 49.4 ఓవర్లలో 241 పరుగుల చేసి ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ 62 పరుగులు, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో రాణించారు.
మిగతా బ్యాటర్లు బాబార్ అజామ్ 23 పరుగులు, ఈమామ్ ఉల్ హలక్ 10 పరుగులు, సల్మాన్ 19 తక్కువ పరుగులకే వెనుతిరిగారు.
Details
3 వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్
చివర్లో ఖుష్దిల్ షా 38 పరుగులతో చెలరేగడంతో పాక్ జట్టు 240 పరుగుల మార్కును దాటింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, హర్ధిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలా ఓ వికెట్ తీశారు.
టీమిండియా గెలుపునకు 242 పరుగులు అవసరం
ఈ మ్యాచులో పాకిస్థాన్ ఓడిపోతే ఛాంపియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది