కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు భలే డిమాండ్.. కొడితే సిక్సులే!
కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్‌లకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ బ్యాట్లను వినియోగించే అంతర్జాతీయ క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈసారి భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023కు తొలిసారి ఈ బ్యాట్ ను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 17 మంది అంతర్జాతీయ క్రికెటర్లు కాశ్మీర్ విల్లో బ్యాట్ తో మైదానంలోకి దిగి బౌండరీల వర్షం కురిపించాలని భావిస్తున్నారు. ఆర్‌జీ 8 స్పోర్ట్స్ సంస్థ కాశ్మీర్‌లో ఈ బ్యాట్‌లను తయారు చేస్తోంది. అనంత్ నాగ్ జిల్లాలోని సంగమ్ ప్రాంతంలో ఉన్న ఆర్‌జీ 8 స్పోర్ట్స్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ వంటి జట్లకు కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను అందజేస్తున్నామని యజమాని ఫౌజల్ కబీర్ స్పష్టం చేశారు.
గత రెండేళ్లో 1.85 లక్షల కంటే ఎక్కువ కాశ్మీర్ విల్లో బ్యాట్లు దిగుమతి
ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో యూఏఈ, వెస్టిండీస్, ఒమన్ ఆటగాళ్లు ఈ కాశ్మీర్ విల్లో బ్యాట్ ల తోనే బరిలోకి దిగారు. గత రెండేళ్లలో 1.85 లక్షల కంటే ఎక్కువ కాశ్మీర్ విల్లో బ్యాట్లను క్రికెట్ ఆడే దేశాలకు ఎగుమతి చేశారంటే, వీటి డిమాండ్ ఏ మాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. యూఏఈకి చెందిన జునైద్ సిద్ధిఖీ 2022లో శ్రీలంకతో జరిగిన మ్యాచులో కాశ్మీర్ విల్లో బ్యాట్‌తో 109 మీటర్ల సిక్స్ కొట్టడంతో ఈ బ్యాట్ లకు క్రేజ్ పెరిగింందని కబీర్ పేర్కొన్నారు. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో తొలిసారి ఈ బ్యాట్‌తో అంతర్జాతీయ క్రికెటర్లు పలువురు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.