ఐపీఎల్ 2023లో ఫాఫ్ డుప్లెసిస్ సరికొత్త చరిత్ర
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచులో అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచులో 47 బంతుల్లో 71 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్ లో 700 పరుగులు చేసిన ఆటగాడిగా డుప్లెసిస్ నిలిచాడు. ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నారు. అదే విధంగా విరాట్ కోహ్లీ సెంచరీ చెలరేగడంతో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫ్లే ఆఫ్స్ రేసుకు మరింత చేరువైంది. డుప్లెసిస్ తర్వాత శుభ్‌మాన్ గిల్ 702 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ లో 6 సెంచరీలు బాదిన కింగ్ కోహ్లీ
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 186 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ మొదటి వికెట్ కు 172 పరుగులు జోడించారు. ప్రస్తుతం ఈ టోర్నమెంట్ లో ఆర్సీబీ ఇదో రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. 2021 ఐపీఎల్ సీజన్ లో 633 పరుగులు చేసిన డుప్లెసిస్, ఈ సీజన్లో 700 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ లీడ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో 6 సెంచరీలు బాదిన క్రికెటర్ గా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచులో కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేశాడు.