
RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీని సాధించడంతో ఆర్సీబీ 8వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
తాజా శతకంతో ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ఆరో సెంచరీని నమోదు చేశాడు. ఆరు శతకాలతో కోహ్లీ ఐపీఎల్‌లో క్రిస్ గేల్ సరసన చేరాడు. గేల్ కూడా ఆరు సెంచరీలను సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 5వికెట్ల నష్టానికి 186పరుగులు చేసింది.
ఈ క్రమంలో బరిలోకి దిగిన బెంగళూరు నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే మొదటి ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసెన్, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ చేయడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
Match 65. Royal Challengers Bangalore Won by 8 Wicket(s) https://t.co/xdReDEWVDX #TATAIPL #SRHvRCB #IPL2023
— IndianPremierLeague (@IPL) May 18, 2023