
Harbhajan Singh: హిందీ కామెంట్రీ నాణ్యతపై అభిమాని ఫిర్యాదు..స్పందించిన హర్భజన్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ హిందీ కామెంట్రీను మెరుగుపర్చుకుంటామని హామీ ఇచ్చాడు.
ఒక ఫ్యాన్ సోషల్ మీడియాలో చేసిన విమర్శనాత్మక పోస్టుకు భజ్జీ ఈ విధంగా స్పందించాడు.
ఐపీఎల్, ఇతర క్రికెట్ టోర్నీల సమయంలో బ్రాడ్‌కాస్టర్లు పలు భాషల్లో కామెంట్రీ అందుబాటులోకి తెచ్చారు.
అయితే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్‌కు ఇవి నచ్చడం లేదు. ముఖ్యంగా హిందీ కామెంట్రీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ ఫ్యాన్ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
'యో యో ఫన్నీ సింగ్' పేరుతో ఉన్న ఎక్స్ ఖాతా ఈ పోస్టును షేర్ చేసింది.
వివరాలు
'గురూ' అంటూ ద్వందార్థ వ్యాఖ్యలు
ఆ వీడియోలో, ఆ ఫ్యాన్ మాట్లాడుతూ.."మన క్రికెట్ బ్రాడ్‌కాస్టర్లకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి హిందీ కామెంట్రీని మెరుగుపర్చండి.మ్యాచ్ చూడటం చాలా కష్టమైపోతోంది.మా చిన్నప్పుడు మణీందర్ సింగ్,అరుణ్‌లాల్,సుశీల్ దోషీ కామెంట్రీ ద్వారా చాలా నేర్చుకునే అవకాశం ఉండేది. వారు టెక్నికల్ విషయాలను వివరిస్తూ,ఫీల్డింగ్ అమరిక ఆధారంగా బౌలర్ ఎలాంటి బంతులు వేయనున్నాడో అంచనా వేసి వ్యూహాలను వివరించేవారు. కానీ, ప్రస్తుతం హిందీ కామెంట్రీ వింటే ఏమీ నేర్చుకోవడానికి లేదు. కవితలు చెప్పడం, గత సంఘటనలను గుర్తు చేయడం మాత్రమే జరుగుతోంది.
ఇటీవల,మ్యాచ్ చూస్తుండగా.. 'గురూ' అంటూ ఓ ద్వందార్థ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఏంటీ..?
అలాగే,ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్-భారత్ మ్యాచ్ సమయంలో.. 'న్యూజిలాండ్ వద్ద టామ్ ఉంటే,మన వద్ద జెర్రీ ఉంది.
వివరాలు
హిందీ కామెంట్రీ ప్రమాణాలను మెరుగుపర్చండి.. ప్లీజ్
సర్ రవీంద్ర జడేజా' అంటూ వ్యాఖ్యానించారు.అసలు ఇదంతా ఏంటీ..?
నేను ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. ఈ కామెంటేటర్లు చాలామంది దేశం కోసం ఆడారు.
కానీ, మీరు మాకు క్రికెట్ గురించి నేర్పించకపోతే, మరెవరు చెబుతారు? నా విజ్ఞప్తి ఒక్కటే - హిందీలో కామెంట్రీ వినే యువతరానికి క్రికెట్ నేర్పించండి. మధ్యలో ఒక్కట్రెండు సార్లు కవితలు చెప్పడం పరవాలేదు, కానీ ప్రతి ఓవర్, ప్రతి బంతికీ కవితలు వల్లించడం తట్టుకోవడం కష్టమవుతోంది. హిందీ కామెంట్రీ ప్రమాణాలను మెరుగుపర్చండి.. ప్లీజ్" అంటూ అభ్యర్థించాడు.
ఈ పోస్టుకు మాజీ ఆఫ్-స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. విలువైన అభిప్రాయాన్ని తెలిపినందుకు ఆ ఫ్యాన్‌కు ధన్యవాదాలు చెప్పాడు.అలాగే,ఈ సూచనలపై కచ్చితంగా పని చేస్తామని హామీ ఇచ్చాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిమాని చేసిన ట్వీట్
Thank you for the input . We will work on it 🙏🎙️ https://t.co/tk4m2km6Ga
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 25, 2025