Fifa World Cup: నేడు మొరాకోతో ఫ్రాన్స్‌కు క్వార్టర్ ఫైనల్ సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠగా మారింది. టైటిల్ కోసం పోటీ పడుతున్న జట్ల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి జరగనున్న ఫ్రాన్స్-మొరాకో మ్యాచ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభం నుంచే టైటిల్ ఫేవరెట్‌గా నిలిచిన ఫ్రాన్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నాకౌట్ తొలి మ్యాచ్‌లో స్వీడన్‌పై ఆధిపత్యం చాటిన ఫ్రాన్స్, ప్రీక్వార్టర్ ఫైనల్లో జర్మనీని ఇంటిముఖం పట్టించిన పరాగ్వేపై మాత్రం కొంత పోరాడి విజయం సాధించింది.
వివరాలు
గోల్డెన్ బూట్ రేసులో మెస్సీకి గట్టి పోటీ..
మరోవైపు మొరాకోను సాధారణ పరిస్థితుల్లో ఓడించడం ఫ్రాన్స్‌కు పెద్ద సవాలు కాకపోయినా, ప్రస్తుత టోర్నీలో ఆ జట్టు అద్భుత ఫామ్‌లో ఉండటం విశేషం. తొలి నాకౌట్ మ్యాచ్‌లో బలమైన నెదర్లాండ్స్‌ను సంచలనంగా ఓడించిన మొరాకో, అనంతరం కెనడాపై కూడా ఘన విజయం నమోదు చేసి తన సత్తాను చాటుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాపేపైనే ఉంది. ఇప్పటికే ఏడు గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో మెస్సీకి గట్టి పోటీ ఇస్తున్న ఎంబాపె, క్వార్టర్ ఫైనల్లో ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది.