LOADING...
FIFA World Cup Racism Row: ఫిఫా వరల్డ్ కప్‌లో రేసిజం వివాదం.. వీడియో ఎనలిస్ట్‌పై వేటు!
ఫిఫా వరల్డ్ కప్‌లో రేసిజం వివాదం.. వీడియో ఎనలిస్ట్‌పై వేటు!

FIFA World Cup Racism Row: ఫిఫా వరల్డ్ కప్‌లో రేసిజం వివాదం.. వీడియో ఎనలిస్ట్‌పై వేటు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌లో జాత్యహంకార వివాదం చర్చనీయాంశంగా మారింది. శ్వేత ఆధిపత్య భావజాలానికి సంకేతంగా భావించే సైగ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఓ వీడియో ఎనలిస్ట్‌పై చర్యలు తీసుకోవాలని ఫిఫా వివక్ష పర్యవేక్షకుడు ఆదేశించారు. ఈ ఘటన ప్రపంచ ఫుట్‌బాల్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన కురసావ్-జర్మనీ మ్యాచ్‌కు ముందు అధికారిక ప్రసారంలో వీడియో ఎనలిస్ట్‌ల బృందాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు చెందిన వీడియో ఎనలిస్ట్ షాన్ ఎవాన్స్ తన కుడి చేతితో 'ఓకే' గుర్తును ప్రదర్శించారు. అయితే, ఈ సంకేతాన్ని కొన్ని వర్గాలు శ్వేత ఆధిపత్యవాదానికి చిహ్నంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. దీంతో ఆయన చేసిన సైగపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు 

స్పందించిన ఫిఫా భాగస్వామి ఫేర్ నెట్‌వర్క్

ఈ ఘటనను పరిశీలించిన ఫిఫా వివక్ష పర్యవేక్షణ కమిటీ సదరు వీడియో ఎనలిస్ట్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ విషయంపై స్పందించిన ఫిఫా భాగస్వామి ఫేర్ నెట్‌వర్క్.. తమ నిపుణుల అభిప్రాయం మేరకు ఆ సైగ జాత్యహంకార భావజాలాన్ని సూచించే అవకాశం ఉందని పేర్కొంది. ''ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించం. వివక్షకు ఫిఫా టోర్నీల్లో స్థానం లేదు. అందుకే సంబంధిత వీడియో ఎనలిస్ట్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై జరుగనున్న వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో అతడికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోం'' అని ఫేర్ నెట్‌వర్క్ స్పష్టం చేసింది.

Advertisement