LOADING...
Asia Cup 2025: గ్రూప్ 'ఎ'లో అగ్రస్థానం కోసం పోరు.. సెమీస్ వెళ్లాలంటే ఇదే సరైన మార్గం 
గ్రూప్ 'ఎ'లో అగ్రస్థానం కోసం పోరు.. సెమీస్ వెళ్లాలంటే ఇదే సరైన మార్గం

Asia Cup 2025: గ్రూప్ 'ఎ'లో అగ్రస్థానం కోసం పోరు.. సెమీస్ వెళ్లాలంటే ఇదే సరైన మార్గం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ 2025లో భారత జట్టు, పాకిస్తాన్‌తో ఢీ కొట్టబోతోంది. ఈ హై-వోల్టేజ్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, రెండు దేశాల అభిమానులకు ఒక క్రికెట్ పండుగగా మారనుంది. ముఖ్యంగా, ఈ పోరులో విజయం సాధిస్తే భారత్ దాదాపు సెమీ-ఫైనల్స్ బర్తీ ఖాయం చేసుకున్నట్టే.

DEtails

 టీమిండియాకు ఈ మ్యాచ్ ప్రత్యేకం

గ్రూప్-ఎలో భారత్, పాకిస్తాన్ రెండూ ఇప్పటికే ఒక్కో విజయంతో రెండు పాయింట్ల వద్ద నిలిచాయి. అయితే నెట్ రన్‌రేట్ విషయంలో భారత్ పాకిస్తాన్ కంటే ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే గ్రూప్ టాపర్‌గా నిలిచి సెమీ-ఫైనల్స్‌కు సులభంగా అర్హత సాధిస్తుంది. మరోవైపు, పాకిస్తాన్ కూడా ఈ పోరులో గెలిచి గ్రూప్ అగ్రస్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. కాబట్టి ఈ పోరు గ్రూప్ ఎ పట్టికలో కీలక మార్పులు తీసుకురానుంది

Details

కొత్త ఆటగాళ్లకు సవాల్

ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో భారత జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యువ జట్టుకు ఇది ఒక అగ్నిపరీక్షే. ఒత్తిడితో కూడిన వాతావరణంలో తమ ప్రతిభను చూపించుకునేందుకు యువ ఆటగాళ్లకు ఇది బంగారు అవకాశం.

Details

భారత్-పాక్ క్రికెట్ వైరం 

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ పోరు ఎప్పుడూ అభిమానులను ఉర్రూతలూగించే స్థాయిలో ఉంటుంది. వన్డే అయినా, టీ20 అయినా, ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉత్సాహం, టెన్షన్, డ్రామాతో నిండుతాయి. గణాంకాల పరంగా ఇప్పటివరకు ఆసియా కప్‌లో పాకిస్తాన్ కంటే భారత్‌కే ఎక్కువ విజయాలు దక్కాయి. కఠిన పరిస్థితుల్లోనూ భారత్ గెలిచి ఆధిపత్యం చాటుకుంది. అయితే ఈసారి 2025 ఎడిషన్‌లో పాకిస్తాన్ తన రికార్డును మెరుగుపరుచుకుంటుందా? లేక భారత్ మళ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.