LOADING...
Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్‌ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు
టీమిండియా కూర్పుపై ఫించ్‌ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు

Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్‌ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2025
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. ఈ పరాజయం తర్వాత టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పులు, బౌలింగ్‌ కూర్పు, అలాగే అర్ష్‌దీప్‌ సింగ్‌ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది. మాజీ ఆటగాళ్లు ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ స్పందిస్తూ అర్ష్‌దీప్‌ సింగ్‌ తప్పనిసరిగా తుది జట్టులో ఉండాలి. కనీసం మూడో టీ20లో అయినా అతనికి అవకాశం ఇవ్వాలి. బ్యాటర్లపై ఎక్కువగా ఆధారపడితే గెలవడం కష్టమే.

Details

భారత బౌలర్లకు కష్టతరమైన పరిస్థితి

భారత్‌ కూడా వరల్డ్‌ కప్‌ కోసం ప్రయోగాలు చేస్తోంది కానీ, బౌలింగ్‌ విభాగం కూడా అంతే ముఖ్యమైంది. కేవలం బ్యాటింగ్‌తో విజయాలు సాధ్యం కాదు. సరైన సమతుల్య జట్టుతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందని అన్నారు. రెండో టీ20లో భారత బౌలర్లకు కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. స్కోర్‌బోర్డుపై తగినన్ని పరుగులు లేకపోవడం వల్లే వాళ్లు ఒత్తిడికి లోనయ్యారు. ఇంకాస్త రన్స్‌ ఉండి ఉంటే మ్యాచ్‌ దిశ మారిపోయేదని అన్నారు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది. ఇక భారత బ్యాటింగ్‌లో యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ మాత్రమే రాణించాడు. అభిషేక్‌ శర్మ ఇన్నింగ్స్‌ అద్భుతం. వికెట్లు పడుతున్నా సరే తన దూకుడును కొనసాగించాడు.

Details

రెండో టీ20లో125 పరుగులకే ఆలౌట్

అతని స్ట్రైకింగ్‌ ఆసీస్‌ బౌలర్లను ఇబ్బందిపెట్టింది. అయితే మిచెల్‌ మార్ష్‌ అతనికి ఎక్కువ స్ట్రైక్‌ రాకుండా చేయడంలో విజయవంతమయ్యాడు. లేకపోతే భారత్‌ మరికొన్ని పరుగులు చేసి ఉండేది. అప్పుడు మ్యాచ్‌ కాస్త కఠినంగా మారేదని ఫించ్‌ వ్యాఖ్యానించాడు. రెండో టీ20లో భారత్‌ 125 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ 68 పరుగులు, హర్షిత్‌ రాణా 35 పరుగులు చేశారు. అయితే, మిగిలిన బ్యాటర్లు ఎవరూ డబుల్‌ డిజిట్‌ చేరుకోలేకపోయారు. అనంతరం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది. మూడో టీ20 మ్యాచ్‌ ఆదివారం హోబార్ట్‌లో జరగనుంది.