Tilak Varma : ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన తిలక్ వర్మ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కాన్‌బెర్రా వేదికగా రేపు (అక్టోబర్ 29) తొలి టీ20 పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా మిడిల్‌ఆర్డర్ బ్యాటర్, తెలుగు యువతేజం తిలక్ వర్మకు (Tilak Varma) ఓ అరుదైన మైలురాయి సొంతం కానుంది. ఈ మ్యాచ్‌లో తిలక్ 38 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగుల మార్క్‌ను చేరుకోనున్నాడు. ఇలా చేస్తే తిలక్, అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డుతో సమానంగా మూడో స్థానంలో నిలుస్తాడు. అదే సమయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టేస్తాడు.
Details
38 పరుగుల దూరంలో తిలక్
తిలక్ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరపున 30 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 53.44 సగటుతో, 149.14 స్ట్రైక్‌రేట్‌తో 962 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. కేవలం 38 పరుగులు చేస్తే, అతడు 1000 పరుగుల మైలురాయిని చేరుతాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ కేవలం 27 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఆయన తరువాత కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఉన్నారు.
Details
అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌లు
విరాట్ కోహ్లీ - 27 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ - 29 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ - 31 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ - 40 ఇన్నింగ్స్‌ల్లో తిలక్ వర్మ ఈ లిస్ట్‌లో స్థానం సంపాదిస్తే, టీమ్ఇండియా భవిష్యత్తు బ్యాటింగ్ స్తంభంగా అతని పేరు మరింత బలపడనుంది.