IPL: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఎప్పుడూ జరగలేదు : మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఇప్పటికే ఉత్కంఠలో ఉన్నారు. అయితే తరచుగా అభిమానుల చర్చల్లో ఫిక్సింగ్ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ విషయాన్ని ఖండిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఫిక్సింగ్ ఐపీఎల్‌లో అసాధ్యమని స్పష్టంచేశారు. ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఫిక్స్ కాలేదు. ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పలేం. ఫోన్లు, ఈ-మెయిల్స్, హోటల్‌లో ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారు అన్నది అన్నీ రికార్డ్‌లో ఉంటాయి. భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుందని పార్థివ్ ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
Details
అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఫిక్సింగ్ జరగలేదు
అందరికీ అక్రిడేషన్ అవసరం. కెప్టెన్‌కు కూడా అక్రిడేషన్ లేకపోతే మైదానం, డ్రెస్సింగ్ రూంలోకి అనుమతించరు. ఐపీఎల్ మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఫిక్సింగ్ జరిగిందని జనాలు చర్చిస్తారు, కానీ వాటిని నిరూపించడం చాలా కష్టమని చెప్పారు. తాజాగా, అభిమానులు గుర్తు చేసుకుంటే 2013లో ఐపీఎల్‌లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు సీజన్లపాటు సస్పెండ్ అయ్యాయి. పార్థివ్ పటేల్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌లో అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.