Page Loader
Diogo Jota: కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా 
కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా

Diogo Jota: కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ పోర్చుగీసు ఫుట్‌బాల్ ఆటగాడు, లివర్‌పూల్ జట్టు తరఫున ఆడిన డియాగో జోటా (Diogo Jota) దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘోర ప్రమాదం స్పెయిన్‌లోని జమోరా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జోటా సోదరుడు ఆండ్రే ఫిలెపి కూడా ప్రాణాలు కోల్పోయాడు. లాంబోర్గిని కారులో ప్రయాణిస్తున్న జోటా సోదరులు ఓ వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో టైరు పేలిపోయింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని వైద్యులు నిర్ధారించారు.

వివరాలు 

లివర్‌పూల్ జట్టు ప్రీమియర్ లీగ్ టైటిల్‌ కైవసం

ఇద్దరు సోదరుల్లో జోటా రెండు వారాల క్రితమే వివాహం చేసుకున్నాడు.తన జీవిత భాగస్వామి అయిన రూటో కార్డోసోను జూన్ 22న పెళ్లాడాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత ఏడాది లివర్‌పూల్ జట్టు ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ విజయవంతమైన జట్టులో డియాగో జోటా కీలక సభ్యుడిగా ప్రధాన పాత్ర పోషించాడు. పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున కూడా జోటా ప్రాతినిధ్యం వహించాడు. యూఈఎఫ్ఏ టోర్నమెంట్‌లో పోర్చుగల్ విజయంలో అతని పాత్ర ఎంతో కీలకంగా నిలిచింది. ఫార్వర్డ్ ప్లేయర్‌గా జోటా గణనీయమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కారు ప్రమాదంలో మృతి చెందిన లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియోగో జోటా