వదినకు లక్ష కాదు.. రూ.ఐదు లక్షలు ఇస్తా : హార్ధిక్ పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య నటాషా స్టాంకోవిక్ ను మళ్లీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో 2020 లాక్ డౌన్ సమయంలో వారిద్దరూ రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే నటాషా గర్బిణీ. 2020 జులై నెలలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరిలో వారు మరోసారి బంధువులు, ఆత్మీయుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే పెళ్లి వేడుకలో వధూవరులను బంధువులు ఆటపట్టిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఓ సరదా సన్నివేశం ఈ పెళ్లి వేడుకలో జరిగింది.
పాండ్యా షూస్ దాచిపెట్టిన వదిన ఫాంకురి శర్మ
ఈ వేడుకలో భాగంగా పాండ్యా వదిన ఫాంకురి శర్మ పాదరక్షలు దాచి పెట్టె ఆచారంతో షాండ్యా షూస్ దాచి పెట్టింది. రూ. లక్ష ఇస్తేనే షూస్ ఇస్తానని ఆమె హార్ధిక్ పాండ్యాను ఆటపట్టించింది. వదిన లక్ష అడగడంతో స్పందించిన పాండ్యా లక్ష కాదు ఏకంగా ఐదు లక్షలు ఇస్తానని వదినతో చెప్పారు. వెంటనే ఆ డబ్బును పంపించాలని పక్కనున్న బంధువులకు తెలియజేశాడు. అయినా ఫాంకురి డబ్బు ట్రాన్సఫర్ చేయాలని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.