Page Loader
MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌
కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌

MacGill: కొకైన్‌ స‌ర‌ఫ‌రా కేసులో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్'కు శిక్ష‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ ఆటగాడు స్టువార్ట్ మెక్‌గిల్ ప్రస్తుతం జైలుశిక్షకు బదులుగా సామాజికసేవ చేయనున్నాడు. కొకైన్ సరఫరాకు సంబంధించి నమోదైనకేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. మెక్‌గిల్ తాను కొకైన్ సేవించిన విషయాన్ని స్వయంగా అంగీకరించాడు. అంతేకాకుండా డ్రగ్ డీలర్లకు తన భాగస్వామి సోదరుడిని పరిచయం చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈకేసులో భాగంగా మెక్‌గిల్ జైలుశిక్షకు బదులుగా 495గంటలపాటు సమాజ సేవ చేయడానికి అంగీకరించాడు. కొకైన్ సంబంధిత ఒప్పందాల నేపథ్యంలో అతడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయిన ఘటన చోటుచేసుకుంది. ఆఅపహరణ కేసులో సంబంధితంగా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే,గత మార్చినెలలో ఈకేసుపై విచారణ చేసిన జ్యూరీ,స్టువార్ట్ మెక్‌గిల్‌కు సంబంధించి క్లారిటీ ఇస్తూ అతడిని కొన్ని అంశాల్లో నిర్దోషిగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 జైలు శిక్ష‌లో భాగంగా స‌మాజ సేవ‌లో మెక్‌గిల్