Stuart MacGill: ఆసీస్ మాజీ క్రికెటర్ కు బిగ్ షాక్..కొకైన్ సరఫరాలో దోషిగా తేల్చిన కోర్ట్.. కఠిన శిక్ష పడే అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా క్రికెట్‌లో తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మాజీ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్ ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడు.
ఈ దిగ్గజ స్పిన్ బౌలర్‌పై డ్రగ్స్ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీనివల్ల మెక్‌గిల్ భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశముంది.
కొకైన్ వంటి మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం చేసినట్లు అతనిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో మెక్‌గిల్ తన బావమరిదితో కలిసి ఓ మాదకద్రవ్య వ్యాపారితో కొకైన్ ఒప్పందం కుదుర్చుకున్నాడని కోర్టు నిర్ధారించింది.
వివరాలు
కోర్టు తీర్పు
కొకైన్ కేసులో స్టువర్ట్ మెక్‌గిల్ దోషి అని కోర్టు ప్రకటించింది. మార్చి 13న ఎనిమిది రోజుల విచారణ అనంతరం, న్యూ సౌత్ వేల్స్ కోర్టు జ్యూరీ అతనిని దోషిగా తేల్చింది.
మెక్‌గిల్ తన బావమరిదికి మద్దతుగా ఓ డ్రగ్ డీలర్‌తో కొకైన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కోర్టు తెలిపింది.
అయితే, అతను స్వయంగా ఈ మాదకద్రవ్యాలను వినియోగించలేదని కోర్టు స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెక్‌గిల్ బావమరిదితో మాదకద్రవ్య వ్యాపారి ఒప్పందాన్ని ఏర్పాటు చేసినందుకు దోషిగా..
Ex-test cricketer Stuart MacGill 54, found guilty of supplying cocaine in Australia, MacGill, a spin bowler who played 44 test matches for Australia and took 208 wickets, faced trial on a single charge of participating in the supply of a prohibited drug. 💩 pic.twitter.com/jujypDXNv9
— Sumner (@renmusb1) March 13, 2025
వివరాలు
కేసు వివరాలు
NSW కోర్టు విచారణలో,2021 ఏప్రిల్‌లో మెక్‌గిల్ తన బావమరిది మారినో సోటిసోపౌలోస్,న్యూట్రల్ బే రెస్టారెంట్ కింద పనిచేసే ఓ వీధి స్థాయి డ్రగ్ డీలర్ మధ్య కొకైన్ ఒప్పందాన్ని ఏర్పాటుచేసినట్లు తేలింది.
ఈ ఒప్పందానికి సంబంధించి రెండు ప్రధాన సమావేశాలను మెక్‌గిల్ ఏర్పాటు చేసినట్లు కోర్టు తెలిపింది.
కోర్టులో హాజరైన మెక్‌గిల్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు.కొకైన్ అక్రమ రవాణాలో తనకు ఎటువంటి పాత్ర లేదని,తాను నేరస్థుడిని కాదని కోర్టుకు విన్నవించుకున్నాడు.
కేసు విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్,స్టువర్ట్ మెక్‌గిల్,శాశ్వత కొకైన్ డీలర్‌గా గుర్తించిన"ఇండివిజువల్ ఏ",మిస్టర్ సోటిరోపౌలోస్ మధ్య 1 కిలోగ్రాం కొకైన్ కోసం $330,000 విలువైన ఒప్పందం కుదిరినట్లు కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో మెక్‌గిల్‌కు శిక్ష విధించే అంశం త్వరలో నిర్ణయించనుంది.