Ashok Dinda : రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీమిండియా మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా మరోసారి రాజకీయాల్లో తన సత్తా చాటారు. పశ్చిమ బెంగాల్‌లోని మొయినా నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి 16,241 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. దిండాకు మొత్తం 1,27,166 ఓట్లు రాగా, ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి చందన్ మండల్ 1,10,925 ఓట్లు మాత్రమే సాధించారు. ఇదే మొయినా నియోజకవర్గం నుంచి గతంలో కూడా దిండా ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. విజయం అనంతరం దిండా మాట్లాడుతూ, "నేను కష్టపడి పనిచేశాను. చేయాల్సిన పనిపై దృష్టి పెట్టాను. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది.
వివరాలు
ఇది ప్రజల విజయం
మొయినా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాలి. ఇది నా విజయం కాదు, ప్రజల విజయమని పేర్కొన్నారు. క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, దిండా 2009 నుంచి 2013 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 13 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆయన, వన్డేల్లో 12 వికెట్లు, టీ20ల్లో 17 వికెట్లు తీశారు. ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడి 69 వికెట్లు సాధించారు. 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిండా, అదే ఏడాది బీజేపీలో చేరారు. ఆ తరువాత మొయినా నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి సంగ్రామ్ డోలుయిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వరుసగా రెండోసారి విజయం సాధించి సత్తా చాటాడు