Page Loader
వైకాపా నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు కన్నుమూత
మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు మృతి

వైకాపా నేత, రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2023
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు(83) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం హైదరాబాద్‌లోని మాదాపూర్ లోని తన అపార్ట్‌మెంట్‌లో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన 2004 నుంచి 2009 వరకు రాజోలు శాసనసభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన 1999లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి దిగి ఏవీ సూర్యనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం మళ్లీ 2004లో సత్యనారాయణరాజుపై విజయం సాధించారు. కృష్ణంరాజు భార్య మల్లీశ్వరి తితిదే పాలకవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

Details

కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సంతాపం

కృష్ణంరాజు భౌతిక కాయాన్ని గురువారం సఖినేటిపల్లిలోని ఆయన నివాసానికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం సోంపల్లిలోని శ్మశనవాటికలో అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. కృష్ణంరాజు మరణం పట్ల సోషల్‌ మీడియాలో రాజకీయ నాయకులు, ఆయన అభిమానులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.