Page Loader
టీమిండియా మాజీ ఓపెనర్ మృతి
మృతి చెందిన టీమిండియా మాజీ ఓపెనర్ సుధీర్ నాయక్

టీమిండియా మాజీ ఓపెనర్ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ ఓపెనర్, వాంఖడే స్టేడియం క్యూరేటర్ సుధీర్ నాయక్ మృతి చెందాడు. గత నెలలో బాత్ రూంలో జారి పడటంతో తలకు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నిన్ని రాత్రి మృతి చెందాడు. గవాస్కర్, అజిత్ వాడేకర్, మన్కడ్ లాంటి స్టార్స్ అందుబాటులో లేని సమయంలో రంజీలో 1971 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపిన ఘనత సుధీర్ నాయక్ ది. సుధీర్ నాయక్ భారత్ తరుపున 1974లో మూడు టెస్టు మ్యాచ్ లు ఆడారు. 87 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 4376 పరుగులు చేశారు.

మహారాష్ట్ర

మహారాష్ట్ర క్రికెట్ బోర్డు సంతాపం

బ్యాటింగ్​లో దూకుడుగా ఉండే ఆయన.. ఫస్ట్ క్లాస్​ మ్యాచుల్లో ఏడు సెంచరీలను కొట్టాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం. నాయక్ గా కోచ్ కు మంచి పేరుంది. జహీర్ ఖాన్ ఎదుగుదలకు ఆయన ఎంతో కృషి చేశారు. అతను ముంబై సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా, వాంఖడే స్టేడియం క్యురేటర్ గా కూడా పనిచేశారు. ఆయన మరణంలో మహారాష్ట్ర క్రికెట్ బోర్డు సహా పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.