Page Loader
పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్
పృథ్వీ షా గురించి మాట్లాడిన సెహ్వాగ్

పృథ్వీషా ఆటతీరు మార్చుకో.. లేదంటే వాళ్లను చూసి నేర్చుకో : వీరేంద్ర సెహ్వాగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ ఘాటు విమర్శలు చేశాడు. ఐపీఎల్ లో ఆడిన రెండు మ్యాచ్‌లో పృథ్వీషా పూర్తిగా నిరాశపరిచాడు. దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్న అతను టీమిండియాలో మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. పృథ్వీ సారథ్యంలో అండర్-19 వరల్డ్ కప్ ఆడిన మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. చెత్త షాట్లతో చాలా సార్లు పృథ్వీ షా వికెట్ ను కోల్పోయాడని, అయితే తప్పుల నుంచి గుణపాఠాలు మాత్రం నేర్చుకోలేకపోతున్నాడని చెప్పాడు. అతని కెప్టెన్సీలో అండర్ 19 ఆడిన గిల్ టీమిండియా తరుపున టెస్టులు, వన్డేలు, టీ20లలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడని తెలిపారు.

వీరేంద్ర సెహ్వాగ్

పృథ్వీషా వాళ్లను చూసి నేర్చుకోవాలి : సెహ్వాగ్

మరోపక్క రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ లో విజృంభిస్తున్నాడని, ఒకసారి ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడని, ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా అత్యధిక పరుగులు చేశారని సెహ్వాగ్ గుర్తు చేశారు. వీరిద్దరిని చూసి పృథ్వీ షా నేర్చుకోవాలన్నారు. అయితే ఐపీఎల్‌లో పృథ్వీ షా నిలకడైన ప్రదర్శన కనబరచలేకపోతున్నాడని, అతని ఆటతీరు మార్చుకోవాలని చెప్పారు. కాగా గుజరాత్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ.. మహ్మద్‌ షమీ ట్రాప్‌లో చిక్కి అల్జారీ జోసెఫ్‌నకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియానికి చేరిన విషయం తెలిసిందే.