శ్రీశాంత్ చెంపదెబ్బ ఘటనపై సెహ్వాగ్ ఫన్ని కౌంటర్
వెటకారాన్ని కూడా చమత్కారంగా మార్చి కౌంటర్ ఇవ్వడంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అతడు చేసే ఫన్నీ ట్విట్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో శ్రీశాంత్ ను హార్భజన్ చెంపదెబ్బ కొట్టిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇందులో హర్భజన్ సింగ్‌పై సెహ్వాగ్ ఫన్నీ కామెంట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ ఆరంభంలో మొహాలీ వేదికగా శ్రీశాంత్ పంజాబ్ తరుపున ఆడగా.. హర్భజన్ ముంబాయి ఇండియన్స్ ప్రాతినిథ్యం వహించాడు. శ్రీశాంత్-హర్భజన్ మధ్య మాటల వివాదం ముదరడంలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపపై గట్టిగా కొట్టాడు. అనంతరం శ్రీశాంత్ మైదానంలో కంటతడి పెట్టారు.
ఆ విషయాన్నిమార్చిపొండి : హర్భజన్
ఈ ఘటన తర్వాత కొన్ని రోజులు హర్భజన్, శ్రీశాంత్ మాట్లాడుకోలేదు. తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. వీరిద్దరూ కలిసినప్పుడల్లా కరచాలం చేసుకుంటూ.. హాగ్ చేసుకుంటూ కనిపించారు. ఇందులో భాగంగా హర్భజన్‌తో స్నేహం గురించి శ్రీశాంత్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను మ్యాచ్ ఆడే ముందు భజ్జీని హగ్ చేసుకుంటానని, అప్పుడు తన ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉంటుందని శ్రీశాంత్ చెప్పారు. దీనిపై వెంటనే సెహ్వాగ్ స్పందిస్తూ ఈ ట్రెండ్ బహుశా మొహాలీలో జరిగిన ఆ ఘటన( శ్రీశాంత్ చెంపపై భజ్జీ కొట్టడం) తర్వాతా అని ఫన్నీగా కౌంటర్ వేశాడు. వెంటనే భజ్జీ ఆ విషయాన్ని మార్చిపొండి బాబు అంటూ ఆసౌకర్యంగా ఫీలయ్యాడు.