Page Loader
Danish Kaneria:పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా  
పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా

Danish Kaneria:పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర లేకపోతే ప్రధాని ఎందుకు స్పందించలేదు:డానిష్ కనేరియా  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ పాకిస్థాన్ ప్రోత్సహిత ఉగ్రవాద దాడిలో 28 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశమంతా తీవ్రంగా స్పందిస్తోంది. పలువురు ప్రముఖులు, క్రికెటర్లు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇదే సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా ఈ దాడిపై తీవ్రంగా స్పందించారు.

వివరాలు 

 'ఎక్స్' ద్వారా స్పందించిన డానిష్ కనేరియా 

ఈ విషయంపై తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' ద్వారా డానిష్ కనేరియా ఘాటుగా స్పందించారు. "పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేకపోతే, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికీ ఎందుకు స్పందించలేదు? ఎందుకు అకస్మాత్తుగా సైన్యాన్ని అలర్ట్ లో ఉంచారు? దీనర్థం ఏమిటంటే నిజం మీకే తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు, వారిని లాలించే విధంగా మద్దతు చూపుతున్నారు. ఇది అత్యంత హేయం. మీరు సిగ్గుపడాలి," అని కనేరియా మండిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డానిష్ కనేరియా చేసిన ట్వీట్ 

వివరాలు 

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా నిలిచిన డానిష్ కనేరియా 

డానిష్ కనేరియా గతంలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. కానీ అతని కెరీర్‌లో మతపరమైన వివక్షత, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా అతని ప్రస్థానం అర్థాంతరంగా ముగిసింది. ఈ పరిస్థితుల్లో అతను పాకిస్థాన్‌ను వదిలిపెట్టి తన కుటుంబంతో కలసి అమెరికాలో స్థిరపడ్డాడు. పలు సందర్భాల్లో డానిష్ కనేరియా పాక్ క్రికెట్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. అలాగే భారత్‌పై పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రదాడులను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన పాక్ లోఉన్న ఉగ్రవాద మద్దతుదారులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు.

వివరాలు 

కెరీర్ గణాంకాల్లో కనేరియా ఘనత 

పాకిస్థాన్ తరఫున డానిష్ కనేరియా 61 టెస్టు మ్యాచ్‌లు, 18 వన్డే మ్యాచ్‌లు ఆడారు. టెస్టు క్రికెట్లో ఆయన 34.79 సగటుతో 261 వికెట్లను సాధించారు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టులో నంబర్ వన్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన ఆయన, జట్టు రాజకీయాల వల్ల తన కెరీర్‌ను కోల్పోయారు.