Page Loader
జర్మన్ ఓపెన్‌కు మాజీ వరల్డ్ నెంబర్ వన్ దూరం
జర్మన్ ఓపెన్‌కు దూరమైన శ్రీకాంత్

జర్మన్ ఓపెన్‌కు మాజీ వరల్డ్ నెంబర్ వన్ దూరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ వరల్డ్ నెంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్మమెంట్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం నుంచి ఈ టోర్నీ క్వాలిఫయర్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాంత్ దూరమైన నేపథ్యంలో భారత్ పోరాటానికి లక్ష్య సేన్ సారథ్యం వహించనున్నాడు. లక్ష్యతో పాటు జాతీయ ఛాంపియన్ మిథున్ మంజునాథ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోకున్నారు. పురుషుల సింగల్స్ తొలి రౌండ్లో క్రిస్టో పోపోవ్ తో లక్ష్య, కిన్ యూ తో మిథున్ తలపడనున్నారు.

లక్ష్యసేన్

లీ జి జియాతో తలపడనున్న లక్ష్యసేన్

మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్‌, సైనా నెహ్వాల్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప- సుమీత్‌రెడ్డి బరిలో ఉన్నారు. తాను క్వార్టర్ ఫైనల్స్‌లో లీ జి జియాతో తలపడే అవకాశం ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని, కచ్చితంగా మెరుగైన ఫలితాన్ని సాధిస్తానని సేన్ చెప్పాడు. మలేషియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ వరుసగా మొదటి రౌండ్‌లోనే నిష్ర్కమించి నిరాశ పరిచిన విషయం తెలిసిందే.