LOADING...

							ఇంటిదారి పట్టిన లక్ష్య సేన్, సైనా నెహ్వాల్
రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించిన లక్ష్యసేన్

ఇంటిదారి పట్టిన లక్ష్య సేన్, సైనా నెహ్వాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సొంత గడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల సింగల్స్ లో డిఫెండింగ్ చాంఫియన్ లక్ష్యసేన్, మహిళల సింగల్స్‌లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ పరాజయం పాలయ్యారు. లక్ష్యసేన్ 21-16, 15-21, 18-21తో ప్రపంచ 20వ ర్యాంకర్ డెన్మార్క్‌కు చెందిన రాస్మస్ గెమ్కే చేతిలో ఓడిపోయాడు.

బ్యాడ్మింటన్‌

భారత్‌కు నిరాశే మిగిలింది

కృష్ణ ప్రసాద్ గరగ, విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 14-21, 10-21తో చైనాకు చెందిన లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక విజేతలైన గాయత్రీగోపీచంద్, ట్రీసా జాలీ 9-21, 16-21 తేడాతో చైనాకు చెందిన ఆరో సీడ్ జాంగ్ షు జియాన్, జెంగ్ యు చేతిలో పరాజయం పాలయ్యారు. మలేషియా ఓపెన్‌లో మహిళల, పురుషుల సింగిల్స్‌లో నెహ్వాల్, ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబిశ్రీకాంత్ వరుసగా మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచారు. శ్రీకాంత్ 19-21, 14-21తో కెంటా నిషిమోటో చేతిలో ఓడిపోగా, నెహ్వాల్ 12-21, 21-17, 12-21తో హన్ యుయె చేతిలో ఓడిపోయింది.