Page Loader
IND vs ENG : ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. చ‌రిత్ర సృష్టించేందుకు 25 ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్‌
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. చ‌రిత్ర సృష్టించేందుకు 25 ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్‌

IND vs ENG : ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. చ‌రిత్ర సృష్టించేందుకు 25 ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు నాల్గవ టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసేందుకు బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టు ఇప్పటికే మాంచెస్టర్‌కు చేరుకొని కఠినమైన నెట్ సెషన్లలో పాల్గొంటోంది. ఈ కీలక టెస్టు ప్రారంభానికి ముందే భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ ఒక అరుదైన ఘనతను సాధించేందుకు అంచున ఉన్నాడు.

Details

మూడో టెస్టుల్లో 607 టెస్టులు

ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 25 పరుగులు చేసినా చాలు.. ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా చరిత్రలో నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ లెజెండరీ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్ పేరిట ఉంది. ఆయన 2006లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగు టెస్టుల్లో 90.14 సగటుతో 631 పరుగులు చేశారు. ఇక శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో 101.16 సగటుతో 607 పరుగులు సాధించాడు. ఇంకో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ద్వారా గిల్‌ రికార్డు తిరగరాయే అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నాడు.

Details

ఇంగ్లండ్ గడ్డపై ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు

మహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) - 4 టెస్టుల్లో 631 పరుగులు (2006) శుభ్‌మన్ గిల్ (భారత్) - 3 టెస్టుల్లో 607 పరుగులు (2025 - కొనసాగుతోంది) రాహుల్ ద్రవిడ్ (భారత్) - 4 టెస్టుల్లో 602 పరుగులు (2002) విరాట్ కోహ్లీ (భారత్) - 5 టెస్టుల్లో 593 పరుగులు (2018) సునీల్ గవాస్కర్ (భారత్) - 4 టెస్టుల్లో 542 పరుగులు (1979) సలీమ్ మాలిక్ (పాకిస్తాన్) - 5 టెస్టుల్లో 488 పరుగులు (1992) గిల్‌ 25 పరుగులు సాధిస్తే ఈ జాబితాలో అగ్రస్థానంలోకి చేరుతాడు. ఇది కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా భారత జట్టు పునరుజ్జీవానికి కూడా ప్రేరణగా నిలిచే అవకాశముంది.