
ENG vs IND: భారత్‌తో నాలుగో టెస్టు.. ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్ రీ-ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ కింద భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ ప్రస్తుతం సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు నాలుగో టెస్టు మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్ జూలై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) 14 మందితో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది.
Details
బషీర్‌కి గాయం - లియామ్ డాసన్‌కు అరుదైన అవకాశం
మూడో టెస్టులో గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ సిరీస్ మిగతా భాగానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఎడమచేతి ఆర్తోడాక్స్ స్పిన్నర్ లియమ్ డాసన్‌కు అవకాశం కల్పించారు. ఇదే ఈ జట్టులో కనిపించిన ఏకైక మార్పు. ఆసక్తికరంగా, డాసన్‌కు ఇది ఎనిమిదేళ్ల విరామం తర్వాత టెస్టు జట్టులో స్థానం లభించడం విశేషం. డాసన్ చివరిసారిగా 2017లో దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడాడు. అప్పటిదాకా మూడు టెస్టుల్లో కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ఈ మధ్యకాలంలో డొమెస్టిక్ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తుండటంతో సెలక్టర్లు అతడిపై మళ్లీ దృష్టి సారించారు.
Details
క్రాలీకి మరో ఛాన్స్
మూడు టెస్టుల్లో విఫలమైనప్పటికీ ఓపెనర్ జాక్ క్రాలీకి సెలక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. అతనిపై నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇంగ్లాండ్ జట్టు ఇదే బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలీ, లియమ్ డాసన్, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ ఈ జట్టుతో మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. సిరీస్‌ను గెలవాలంటే భారత్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇక లియమ్ డాసన్ పునరాగమనం ఇంగ్లాండ్‌కు ఎంత వరకూ ఉపయోగపడుతుందో వేచి చూడాలి.