LOADING...
FIFA World Cup: ఎంబాపె మరో గోల్‌.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్
ఎంబాపె మరో గోల్‌.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

FIFA World Cup: ఎంబాపె మరో గోల్‌.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 10, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ జట్టు 2-0 తేడాతో మొరాకోను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ స్టార్‌ ఫార్వర్డ్‌ కిలియన్‌ ఎంబాపె మరోసారి తన సత్తా చాటుతూ ఒక గోల్‌ నమోదు చేశాడు. మరో గోల్‌ను డెంబెలె సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఇదే స్కోరుతో ఖతార్‌లో నిర్వహించిన 2022 ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో కూడా ఫ్రాన్స్‌ మొరాకోపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

వివరాలు

అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా స్టార్‌..

తాజా విజయంతో ఫ్రాన్స్‌ జట్టు మంగళవారం డాలస్‌లో జరిగే సెమీఫైనల్లో స్పెయిన్‌ లేదా బెల్జియం జట్టుతో తలపడనుంది. మొరాకోపై నమోదు చేసిన గోల్‌తో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా స్టార్‌ లియోనెల్‌ మెస్సితో కిలియన్‌ ఎంబాపె సమానంగా నిలిచాడు. ఇద్దరి ఖాతాల్లోనూ ప్రస్తుతం ఎనిమిది గోల్స్‌ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో 60వ నిమిషంలో ఎంబాపె సాధించిన గోల్‌ అతడి ప్రపంచకప్‌ కెరీర్‌లో 20వది కాగా, మెస్సి ఇప్పటివరకు మొత్తం 21 ప్రపంచకప్‌ గోల్స్‌ నమోదు చేశాడు.

Advertisement