Page Loader
MS Dhoni: పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు… మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం!
పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు… మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం!

MS Dhoni: పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు… మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ చరిత్రలో అపురూపమైన ముద్ర వేసిన 'కెప్టెన్ కూల్' ఎంఎస్ ధోని నేడు తన 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుని భారత్‌కు అనేక చిరస్మరణీయమైన అందించిన ధోనీ, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు. 1981లో బీహార్ (ప్రస్తుతం జార్ఖండ్) రాష్ట్రంలోని రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా ధోనీ తన ఆట పట్ల ఆసక్తిని కోల్పోలేదు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కొనసాగుతూ, గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు నాయకత్వం వహించి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని మళ్లీ నిరూపించారు.

Details

రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించిన ధోని

ధోనీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు పాన్ సింగ్, తల్లి పేరు దేవకీ దేవి. మొదట ఫుట్‌బాల్ గోల్ కీపర్ గా ఆడేవారు. కోచ్ సూచన మేరకు క్రికెట్ వైపు మొగ్గుచూపి, ఆటలో తన ప్రతిభను వెలికితీశారు. ఆరంభంలో తన స్టైలిష్ హేర్ స్టైల్‌తో యువతను ఆకట్టుకున్న ధోనీ, దూకుడైన ఆటతీరు వల్ల త్వరగా అభిమానులను సంపాదించారు. 2007లో టీమిండియాకు తొలి టీ20 వరల్డ్ కప్‌ అందించి, జాతికి తన నాయకత్వాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్‌, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి ప్రపంచ క్రికెట్‌లోను స్టార్‌గా ఎదిగారు. అంతేకాదు, అన్ని ఫార్మాట్లలో టీమిండియాను నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత ధోనీకే చెందుతుంది.

Details

ధోనీకి లభించిన ఎనిమిది ప్రతిష్టాత్మక అవార్డులు

1. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న(2008)- భారత క్రీడల అత్యున్నత గౌరవం. 2. పద్మశ్రీ (2009)- భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం. 3. ఐసీసీ పీపుల్స్ ఛాయిస్ అవార్డు(2013)- ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ఓటుతో పొందిన గౌరవం. 4. పద్మభూషణ్(2018)- మూడవ అత్యున్నత పౌర పురస్కారం. 5. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది డికేడ్(2011-2020)- కెప్టెన్‌, వికెట్‌కీపర్‌గా ఎంపిక. 6. ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది డికేడ్(2011-2020)- కెప్టెన్‌, వికెట్‌కీపర్‌గా ఎంపిక. 7. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్(2011-2020)- క్రీడా స్ఫూర్తికి ప్రతీకగా అందుకున్న గౌరవం. 8. ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్(2020)-క్రికెట్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన లెజెండ్‌గా గుర్తింపు.

Details

కెప్టెన్‌గా ధోనీ రికార్డులు

ధోనీని 2007లో టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియమించారు. ఆయన నాయకత్వంలో భారత్‌: 60 టెస్టులు, 200 వన్డేలు, 72 టీ20లు ఆడింది. ఈ మొత్తం 332 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌ 179 గెలవగా, 120 మ్యాచ్‌ల్లో ఓడింది. ధోనీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన జట్టుగా మారింది.