WPL వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో ఐదు ఫ్రాంచేజీలు పోటాపోటిగా మహిళా ప్లేయర్స్ ను కొనుగోలు చేశారు. ఈ టోర్ని కూడా ఐపీఎల్ అంత హిట్ అవుతుందని బీసీసీఐ నమ్ముతోంది. డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ పోటీ పడనున్నాయి. ఉమెన్స్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర ప్లేయర్‌గా స్మృతి మంధాన రికార్డుకెక్కంది. ఆమెను ఏకంగా రూ.3.4కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. విదేశీ ఆల్‌రౌండర్లు నాట్ సివర్, యాష్లే గార్నర్ 3.2 కోట్లను ఫ్రాంచేజీలు చెల్లించాయి. వేలం ముగిసేసరికి ఐదు ఫ్రాంచేజీలు కలిసి 87 మంది ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అంటే 322 మంది ఆటగాళ్లు అమ్ముడుపోకపోవడం గమనార్హం.
అమ్ముడుపోని ఆటగాళ్ల పేర్లు
సుజీ బేట్స్, టేమీ బ్యూమౌంట్, తాజ్‌మిన్ బ్రిట్స్, లారా వోల్వార్ట్ , చమారీ ఆటపట్టు, సూన్‌లూస్, డానీవ్యాట్, బెజూడెన్‌హోట్, సంజీవని, జహనారా, కోనెల్, డేవీస్, అయబోంగాఖాకా, షకీరాసెల్మాన్, లీ టాహుహు, అఫీ ఫ్లెచర్ , సారా గ్లెన్, ఫ్రాన్ జోనాస్, నోంకులెకో లాబా, ఇనోకా రనవీర,, నడైన్ డి క్లర్క్, లీ కాస్పెరెక్ ఈ ఆటగాళ్ల 30లక్షలు ప్రైస్ మనీగా ఉన్నా ఏ ఫ్రాంచేజీలు ఆసక్తి చూపలేదు. మహెక్‌పోకర్ , యామినీబిల్లోర్, షిప్రా గిరి, శ్వేత వర్మ, టెస్ ఫ్లింటాఫ్, బారెడ్డీ అనూష, ఝాన్సీ లక్ష్మీ, చల్లా, విన్నీ సూజన్, జయ మోహితే, కేశ పటేల్, పాలక్ పటేల్, తారానుమ్ పఠాన్, జానకీ రాథోడ్ పది లక్షలతో ఆక్షన్‌లోకి దిగినా అమ్ముడుపోలేదు