Varun Chakravarthy: రవి బిష్ణోయ్‌తో ఆహ్లాదకరమైన పోటీ.. వరణ్ చక్రవర్తి కీలక ప్రకటన
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జాతీయ జట్టులోకి మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడువికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ తన ఓవర్ స్పిన్ మాయజాలంతో తౌహిద్ హృదయ్, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్‌ల వికెట్లు తీశాడు. జట్టుకు దూరంగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న ఎమోషనల్ రోలర్ కోస్టర్ గురించి వరుణ్ మాట్లాడారు. మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భారత జట్టులో తన పేరు ఎందుకు లేదనే ఆలోచన తనను కదిలించిందని ఆయన తెలిపాడు.
11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన భారత్
తాను ఇంకా మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నాడు. ప్రతి దేశవాళీ పోటీలో సమాన దృష్టిని కేంద్రీకరించానని, ఆ రకంగా తాను దీన్ని వదిలిపెట్టకూడదనే ప్రేరణను తనలో తీసుకొచ్చిందన్నారు. తనతోటి స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో జట్టులో మంచి పోటీ ఉందని తెలిపారు. రవి తనని ఉత్సాహపరుస్తూ మెసేజ్‌లు పంపుతాడని, ముఖ్యంగా పోటీ ఉండటం చాలా మంచిదని వరుణ్ అన్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలో ఛేదించి సత్తా చాటింది.