Page Loader
గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం
గన్నర్స్ కోసం 76 పీఎల్ మ్యాచ్‌లు ఆడిన గాబ్రియేల్ మార్టినెల్లి

గాబ్రియేల్ మార్టినెల్లి ఆర్సెనల్‌తో కొత్త ఒప్పందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రీమియర్ లీగ్ 2022-23 లీడర్స్ ఆర్సెనల్‌తో గాబ్రియేల్ మార్టినెల్లి కొత్త ఒప్పందంపై సంతకం చేశాడు. 21 ఏళ్ల బ్రెజిలియన్ మార్టినెల్లి మునుపటి ఒప్పందం వచ్చే సీజన్ చివరిలో ముగియనుంది. అయితే, అతను అదనపు సంవత్సరం కోసం ఎంపికతో, నూతనంగా నాలుగున్నర సంవత్సరాల ఒప్పందాన్ని అంగీకరించాడు. గాబ్రియేన్ చాలా చిన్నవాడని, అతని నుండి ఇంకా చాలా అశిస్తున్నామని మేనేజర్ మైకెల్ అర్టెటా అన్నారు. ప్రతిసారీ ఆటలో తన శక్తిని నిరూపించుకుంటాడని, శిక్షణలో కూడా ప్రతి రోజూ ఒకేలా ఉంటారని, ఆర్సనల్ తన ప్రతిభను వినియోగించడానికి ఉత్సాహంగా ఉందని మైకెల్ అర్టెటా తెలియజేశారు.

గాబ్రియేల్ మార్టినెల్లి

మార్టినెల్లి సాధించిన రికార్డులివే

గన్నర్స్ కోసం 111 మ్యాచ్‌ల్లో మార్టినెల్లి 25 గోల్స్ చేశాడు. అతను అన్ని పోటీలలో 14 అసిస్ట్‌లతో తన సత్తా చాటాడు. తొలి సీజన్‌లో మార్టినెల్లి ఆకట్టుకున్నాడు. 26 ప్రదర్శనల్లో 10 గోల్స్ చేసి, 3 అసిస్ట్‌లను అందించాడు. మార్టినెల్లి గన్నర్స్ కోసం 76వ PL మ్యాచ్‌లో ప్రదర్శన చేసి, 18 సార్లు స్కోర్ చేశాడు. ప్రస్తుత సీజన్లో 7 గోల్స్, 2 అసిస్ట్‌లను కలిగి ఉన్నాడు. మార్టినెల్లి కేవలం 133 షాట్లలో 37సార్లు లక్ష్యాన్ని సాధించాడు.