LOADING...
Gautam Gambhir: కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్‌ గంభీర్
కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్‌ గంభీర్

Gautam Gambhir: కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్‌ గంభీర్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో భారీ పరాజయం చవిచూసింది. 408 రన్స్‌ తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. ఇప్పటికే కోల్‌కతా టెస్ట్‌లో ఓడిపోయి, 0-1 తేడాతో సిరీస్‌లో భారత జట్టు వెనకబడింది. గువాహటి టెస్ట్‌ కూడా చేజారడంతో సఫారీలు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేశారు. సఫారీల జట్టు దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారత్‌పై భారత్‌లో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కోచ్‌గా కొనసాగాలా లేదా అన్న నిర్ణయం పూర్తిగా బీసీసీఐదేనని స్పష్టం చేశారు. భారత క్రికెట్‌ వ్యవస్థలో వ్యక్తుల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.

వివరాలు 

జట్టు అంతా కలిసి పనిచేయాల్సిందే:  గంభీర్ 

'మీ కోచ్ పదవికి సంబంధించి భవిష్యత్‌ ఎలా ఉంటుంది?' అని మీడియా ప్రశ్నించగా గంభీర్ స్పందిస్తూ— 'అది బీసీసీఐ నిర్ణయించే విషయం. దేశం, జట్టు ముఖ్యం— నేను వ్యక్తిగా కాదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను సమం చేశాం. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కూడా సాధించాం. అప్పుడు కూడా నేను కోచ్‌గానే ఉన్నాను' అని గుర్తు చేశారు. టెస్ట్‌ల్లో వచ్చిన వైఫల్యానికి ఒక్కరినే బాధ్యుణ్ని చేయడం సరైంది కాదని, ఓటమికి మొత్తం జట్టూ సమానంగా బాధ్యత వహించాల్సిందేనని ఆయన చెప్పారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరుగైన ఫలితాలు రావాలంటే జట్టు అంతా కలిసి పనిచేయాల్సిందేనని గంభీర్ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోచ్‌గా నా భవిష్యత్తుపై బీసీసీఐనే నిర్ణయం తీసుకుంటుంది: గౌతమ్‌ గంభీర్