Gautam Gambhir: అత్యవసరంగా స్వదేశానికి పయనమైన గౌతమ్ గంభీర్.. కారణమిదే?
భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాలోని పర్యటన నుంచి అత్యవసరంగా స్వదేశానికి బయలుదేరారు. వ్యక్తిగత సమస్యల కారణంగా గంభీర్ ఇవాళ ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే డిసెంబర్ 6 న అడిలైడ్‌లో జరిగే రెండవ టెస్టు మ్యాచ్‌కు ముందు తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. 30 నవంబర్ నుండి కేన్‌బెరాలో జరిగే వార్మ్-అప్ మ్యాచ్‌లో గంభీర్ పాల్గొనడం లేదని సమాచారం. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు బుమ్రా నాయకత్వంలో భారత జట్టు గొప్ప విజయాన్ని సాధించింది. బుధవారం, భారత జట్టు పెర్త్ నుండి కేన్‌బెరాకు వెళ్లనుంది.
ప్రత్యేక విందులో భారత ప్లేయర్లు
అక్కడ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఇచ్చే ప్రత్యేక విందులో భారత క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొంటారు. రెండవ టెస్టు మ్యాచ్ డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరగనుంది. దీనికి ముందే ప్రాక్టీస్ మ్యాచ్‌ను టీమిండియా ఆడనుంది. ప్రాక్టీస్ కోసం కోకాబురా పింక్ బాల్‌ని ఉపయోగించనున్నారు. ప్రైమ్ మినిస్టర్స్ లెవన్ జట్టు, జాక్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలో, యువ ఆటగాళ్లతో నిండి ఉంటుంది. ఈ మ్యాచ్ అనధికారికంగా నిర్వహించనున్నారు.