Page Loader
గంగూలీకి గవాస్కర్ వార్నింగ్...బీసీసీఐ అధ్యక్షుడివి కాదంటూ

గంగూలీకి గవాస్కర్ వార్నింగ్...బీసీసీఐ అధ్యక్షుడివి కాదంటూ

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్ క్రికెట్లో సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ లెజెండరీ ప్లేయర్లు.. భారత్ క్రికెట్ ఎన్నో సేవలందించారు. ఒకరు 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన టీమ్‌లో సభ్యుడు కాగా.. మరొకరు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతున్న ఇండియన్‌ క్రికెట్‌ను మళ్లీ ఓ లెవల్‌కు తీసుకెళ్లిన కెప్టెన్‌. గంగూలీ అయితే ఈ మధ్యే బీసీసీఐ అధ్యక్షుడిగా చేసి తప్పుకున్నారు. అలాంటి వ్యక్తికి గవాస్కర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కోల్‌కతా వస్తున్నా.. చూసుకుందాం అంటూ హెచ్చరించారు. గంగూలీ, గవాస్కర్‌ క్రికెటర్లే.. వీళ్లు ఫుట్‌బాల్‌కు వీరాభిమానులు. ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆర్సెనల్‌కు గవాస్కర్‌ అభిమాని. ఆ క్లబ్‌కు చెందిన తన అభిమాన ఆటగాడి సంతకం ఉన్న జెర్సీ ఒకటి గంగూలీ దగ్గర ఉందని, దానిని వచ్చే నెలలో తీసుకుంటానని గవాస్కర్‌ చెప్పాడు.

గవాస్కర్

'నువ్వు బీసీసీఐ అధ్యక్షుడివి కాదు' : గవాస్కర్

"నేను చాలాకాలంగా ఆర్సెనల్‌ ఫాలోవర్‌ను. నా కొడుకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ అభిమాని. అతడు ఆర్సెనల్‌ టీమ్‌లోని నలుగురు ప్లేయర్స్‌ పేర్లు చెప్పమని అడిగేవాడు. నేను థియరీ హెన్రీ, డెన్నిస్‌ బెర్గ్‌క్యాంప్‌ పేర్లు చెప్పేవాడిని. హెన్రీ ఆటను నేను చాలా ఆస్వాదించేవాడిని. అంతేకాదు అతడు నా కోసం ఓ షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ చేసి ఇచ్చాడు" అని గవాస్కర్‌ చెప్పాడు. మాజీ ఆర్సెనల్‌ కెప్టెన్‌ హెన్రీ సైన్‌ చేసిన ఆ జెర్సీ గంగూలీ దగ్గర ఉందని, అతని దగ్గర నుంచి తీసుకుంటానని చెప్పాడు. నేను జనవరి 12న కోల్‌కతా వస్తున్నాను. ఇప్పుడు నువ్వు బీసీసీఐ అధ్యక్షుడివి కూడా కాదు. హెన్రీ నా కోసం సైన్‌ చేసి ఇచ్చిన టీషర్ట్‌ నాకు ఇవ్వు" అని గవాస్కర్‌ అన్నాడు.