Page Loader
ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్స్ జార్జియా వేరేహామ్

ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచ కప్ జట్టులో జార్జియా వేరేహామ్ కు చోటు లభించింది. గతంలో గాయం భారీన పడిన ఈ లెగ్ స్పిన్నర్ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 10 నుండి దక్షిణాఫ్రికాలో జరిగే టీ20 ప్రపంచ కప్ టైటిల్స్ కోసం ఆస్ట్రేలియా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇదే జట్టు అంతకుముందు పాకిస్తాన్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఆడనుంది. ఈ టీ20 మ్యాచ్ లు జనవరి 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఆట నుండి ఆరు నెలల విరామం తర్వాత సాధారణ కెప్టెన్ మెగ్‌లానింగ్ ఫార్మాట్‌కు తిరిగి రావడంతో ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉంది

ఆస్ట్రేలియా

మహిళా జట్టు ఇదే

జట్టును కేవలం 15 మంది ఆటగాళ్లకు కుదించడం ఎల్లప్పుడూ కష్టమైన పని, కానీ తాము పాకిస్తాన్‌ సిరీస్‌లో మంచి స్థానంలో ఉన్నామని, టైటిళ్లను స్వాధీనం చేసుకోవడానికి మంచి జట్టును ఎంపిక చేశామని సెలెక్టర్ షాన్ ఫ్లెగ్లర్ చెప్పార ఆస్ట్రేలియా జట్టు: మెగ్ లానింగ్ (C), అలిస్సా హీలీ (VC, wk), డార్సీ బ్రౌన్, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, తహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్