Page Loader
జర్మనీదే హాకీ ప్రపంచ కప్
జర్మనీ మూడోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

జర్మనీదే హాకీ ప్రపంచ కప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 30, 2023
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 విజేతగా జర్మనీ నిలిచింది. ఆదివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియంను జర్మనీ ఓడించింది. జర్మనీ 5-4 తేడాతో బెల్జియంను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయానికి 3-3తో ఇరు జట్లు సమానంగా నిలిచాయి. ఆట పదో నిమిషానికి వచ్చేసరికే జర్మనీ 0-2 తో వెనుకబడింది. ఆరంభంలో ఫ్లోరెంట్‌ (9వ నిమిషం), టాన్‌గయ్‌ (10వ నిమిషంలో) గోల్స్‌ చేయటంతో బెల్జియం ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత జర్మనీ అద్భుతంగా పోరాడింది. ఆ జట్టు ఆటగాళ్లు వాలెన్‌ (28వ నిమిషం), గొంజాలో (40వ నిమిషం), మాట్స్‌ (47వ నిమిషం) గోల్స్‌ చేయడంతో జర్మనీ 3-2 తేడాతో ముందుకెళ్లింది.

హాకీ

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిక్లాస్ వెలెన్

2002, 2006లో ప్రపంచ్ కప్ గెలిచిన జర్మనీ, 17 ఏళ్ల తరువాత మళ్లీ ఆ గౌరవాన్ని అందుకుంది. రెండు పెనాల్టీలు, పెనాల్టీ కార్నర్‌ను సాధించినందుకు నిక్లాస్ వెలెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. షూటౌట్ లో తొలి షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్‌లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలం కావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది పాకిస్తాన్ నాలుగు సార్లు (1971, 1978, 1982, 1994) టోర్నీని గెలుచుకొని మొదటి స్థానంలో ఉంది.