Page Loader
ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ
నెదర్లాండ్స్‌ను ఓడించిన బెల్జియం

ఫైనల్‌లో తలపడనున్న బెల్జియం, జర్మనీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పురుషుల హాకీ వరల్డ్‌కప్ ఫైనల్స్ లో బెల్జియం, జర్మనీ ప్రవేశించాయి. సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై జర్మనీ విజయం సాధించి, ఫైనల్స్ కి చేరకుంది. బెల్జియం, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠను రేపింది. బెల్జియంలో 30 ఏళ్లు పైబడిన 11 మంది, నెదర్లాండ్స్‌లో 25 ఏళ్లలోపు ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. నిర్ణీత సమయంలో బెల్జియం తరఫున స్టార్ స్ట్రైకర్ టామ్ బూన్ (27వ), నికోలస్ డి కెర్పెల్ గోల్స్ చేసి సత్తా చాటారు. శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐహెచ్ (ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్) పురుషుల ప్రపంచకప్ ఫైనల్‌లో జర్మనీ 4-3తో ఆస్ట్రేలియాను ఓడించింది. స్టార్ డ్రాగ్-ఫ్లిక్కర్ గొంజలో పిలాట్ రెండో అర్ధభాగంలో హ్యాట్రిక్ సాధించాడు.

జర్మనీ

జర్మనీ వరుసగా రెండో మ్యాచ్ విజయం సాధించింది

43వ, 52వ, 59వ నిమిషాల్లో పిలాట్ పెనాల్టీ కార్నర్‌ల ద్వారా గోల్స్ చేశాడు. విరామం వరకు ఆస్ట్రేలియా జట్టు 2-0 ఆధిక్యంలో ఉంది. జెరెమీ హేవార్డ్ (12వ ని.), నాథన్ ఎఫ్రైమ్స్ (27వ ని.), బ్లేక్ గోవర్స్ (58వ ని.) జట్టుకు గోల్స్ చేశారు. 2010లో న్యూఢల్లీలో జరిగిన ఎడిషన్ తర్వాత రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీ ఫైనల్‌లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి, 2002, 2006లో టైటిల్స్ గెలుచుకోవడానికి ముందు 1982లో రజతం సాధించారు. ఆస్ట్రేలియా ఇక కాంస్య పతక పోరును ఆదివారం ఆడనుంది. జర్మనీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2తో ఓడిపోయింది.