Page Loader
2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం
న్యూజిలాండ్‌పై విజయం సాధించిన బెల్జియం జట్టు

2-0 తేడాతో న్యూజిలాండ్‌పై బెల్జియం విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2023
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం విజయం సాధించింది. భారత్ ను ఓడించిన న్యూజిలాండ్ పై 2-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌కు బెల్జియం దూసుకెళ్లింది. బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ జనవరి 20న జపాన్ జరిగిన చివరి పూల్ బి మ్యాచ్లో గాయపడ్డాడు. ఈ స్టార్ ఆటగాడు లేకుండా బరిలోకి దిగిన బెల్జియం, న్యూజిలాండ్ పై పైచేయి సాధించి సత్తా చాటింది.

హాకీ

క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించిన జట్టుపై బెల్జియం పోటీ

ఇంగ్లండ్, జర్మనీల మధ్య బుధవారం క్వార్టర్ ఫైనల్ జరగనుంది. ఈ క్వార్టర్ ఫైనల్‌లో విజయం సాధించిన జట్టుపై సెమీఫైనల్స్ లో బెల్జియం తలపడనుంది. మూడు, నాలుగవ క్వార్టర్స్‌లో బెల్జియం చాలా వరకు అటాకింగ్ చేయడంతో ఎటువంటి గోల్ సాధించలేదు. 2018లో ఇక్కడ జరిగిన చివరి ఎడిషన్‌లో సెమీఫైనల్స్‌లో పెనాల్టీ షూటౌట్‌లో బెల్జియం డచ్‌తో ఓడిపోయింది.