Loading...
Ajinkya Rahane: ఆకాశ్ దీప్‌పై గిల్ ఆగ్రహం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానే!
ఆకాశ్ దీప్‌పై గిల్ ఆగ్రహం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానే!

Ajinkya Rahane: ఆకాశ్ దీప్‌పై గిల్ ఆగ్రహం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ కెప్టెన్ శుభమన్ గిల్ మైదానంలో వ్యవహరించిన తీరుపై మాజీ ఆటగాడు అజింక్య రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్‌పై గిల్ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టాడు. ఇలాంటి సందర్భాల్లో కెప్టెన్ సహచర ఆటగాడికి అండగా నిలవాలే తప్ప.. అందరి ముందు తిట్టకూడదని హితవు పలికాడు.

వివరాలు

రనౌట్ అవకాశం చేజార్చిన ఆకాశ్ దీప్

న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఐదో రోజు ఆటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 71వ ఓవర్ సందర్భంగా డారిల్ మిచెల్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బంతిని మిడ్ ఆన్ వైపు కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు.

నాన్‌స్ట్రైకర్ అతడిని వెనక్కి పంపించాడు. అప్పటికే పిచ్‌లో సగం దూరం వచ్చిన మిచెల్‌ను రనౌట్ చేసే మంచి అవకాశం భారత్‌కు లభించింది.

మిడ్ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ బంతిని సరిగ్గా అందుకోలేకపోయాడు. దీంతో కీలకమైన రనౌట్ అవకాశం చేజారింది.

ఈ తప్పిదాన్ని చూసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మైదానంలోనే ఆకాశ్ దీప్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అరిచాడు. ఈ ఫీల్డింగ్ పొరపాటు భారత్‌కు నష్టం చేసింది.

వివరాలు

ఆటగాడికి మద్దతుగా నిలవాలి: రహానే

ఆ తర్వాత డారిల్ మిచెల్ అజేయంగా 49 పరుగులు చేసి న్యూజిలాండ్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ ఘటనపై సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన అజింక్య రహానే.. గిల్ వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. మైదానంలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో సహచర ఆటగాళ్ల మద్దతు చాలా ముఖ్యం.

ఆకాశ్ దీప్‌కు గిల్ అండగా నిలవాల్సింది. జరిగిపోయిన తప్పు గురించి ఆలోచించడం కంటే.. ఆటగాడిని ప్రోత్సహించడం ముఖ్యం.

అలా చేస్తే తర్వాతి బంతికే వికెట్ తీయొచ్చు లేదా అద్భుతమైన క్యాచ్ పట్టొచ్చు. ఆటగాడికి మద్దతుగా నిలవడం కెప్టెన్ బాధ్యత'' అని రహానే అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT

వివరాలు

మిచెల్, ఫిలిప్స్ పోరాటంతో డ్రా

మరోవైపు ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని న్యూజిలాండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించారు. దీంతో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది.

ADVERTISEMENT