Asian Games : కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్
చైనాలోకి హాంగౌజ్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ప్లేయర్లు పతకాల జోరును కొనసాగిస్తున్నారు. తాజాగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం గోల్డ్ నెగ్గింది. ఫైనల్‌లో 230-228 తేడాతో చైనీస్ తైపీని ఓడించి 19వ గోల్డ్ మెడల్ ను భారత్ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆర్చరీ కాంపౌండ్ మిక్స్ డే ఈవెంట్ లోనూ భారత ప్లేయర్లు జ్యోతి వెన్నమ్; ఓజాస్ గోల్డ్ మెడల్ నెగ్గిన విషయం తెలిసిందే.
సెమీ ఫైనల్ కి అర్హత సాధించిన హెచ్ఎస్ ప్రణయ్
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. రెజ్లర్ పూజా గెహ్లాట్ మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఈవెంట్‌లో మంగోలియాకు చెందిన త్సోగ్ట్-ఒచిరిన్ నముంట్‌సెట్సేగ్‌ను ఓడించి ఫైనల్ కి అర్హత సాధించింది. ఇక భారత స్టార్ షట్లర్ పివి.సింధు చైనా క్రీడాకారాణి చేతిలో ఓటమిపాలైంది. సింధుపై బింగ్‌జోయావో 21-16, 21-12 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ 82 పతకాలను సాధించి పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇందులో గోల్డ్ 16, వెండి 16, కాంస్యం 22 ఉన్నాయి.